రాఘవ్‌ చద్ధాతో రిలేషన్ పై స్పందించిన పరిణీతి

 రాఘవ్‌ చద్ధాతో రిలేషన్ పై స్పందించిన పరిణీతి

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా,  ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.  దీనిపై మీడియా అడిగితే సమాధానం దాటేసుకుంటూ వచ్చారు రాఘవ్ చద్దా. కానీ దీనిపై తాజాగా పరిణీతి స్పందించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించిన ఆమెను రూమర్స్‌పై ఫొటోగ్రాఫర్లు ప్రశ్నించారు దీనికి ఆమె సిగ్గుపడుతూ వెళ్లిపోయారు.  ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న నటితో  ఓ ఫొటోగ్రాఫర్‌ రూమర్స్‌పై ప్రశ్నించాడు. ‘మేడమ్‌.. మీరు డేటింగ్‌లో ఉన్నారని వస్తున్న వార్తలు నిజమేనా?’ అని అడిగారు. దీనికి ఆమె  నవ్వుతూ బాయ్‌, గుడ్‌ నైట్‌ అంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

https://www.instagram.com/reel/CqXBze7oRk4/?utm_source=ig_web_copy_link

ఇటీవలే ముంబైలోని ఓ ఓ రెస్టారెంట్ లో డిన్న ర్ చేస్తూ వీరిద్దరూ మీడియా కంటపడ్డారు. ఆ త‌ర్వాత మార్చి 23న  ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ పాల్గొనడమే కాకుండా.. ఒకే కారులో వెళ్లిపోవడం అటు సినీ వర్గా్ల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది. ఈ సంఘటనలతో రాఘ‌వ్ చ‌ద్దాతో ప‌రిణీతి చోప్రా రిలేషన్లో ఉన్నది నిజ‌మేనంటూ ప్రచారం మొద‌లైంది 2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె ‘చమ్కిలా’, ‘క్యాప్సూల్ గిల్’ చిత్రాలలో నటిస్తోంది.