అదరహో అనేలా.. పరిణీతి-రాఘవ్లా పెళ్లి వీడియో

అదరహో అనేలా.. పరిణీతి-రాఘవ్లా పెళ్లి వీడియో

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chaddha) మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  వీరి వివాహం ఈ నెల (సెప్టెంబర్ 24న) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.

లేటెస్ట్గా వీరి పెళ్లి వీడియోను పరిణితి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక రాజాకుమారుడు..రాజాకుమార్తెకు పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి అర్ధం చేసుకోవొచ్చు. చుట్టూ న‌వాబ్ లు..ప‌టౌడీలు..జమీందారీ వ్య‌వ‌స్థ‌లో ఘనమైన వేడుకను కళ్ల ముందు చూసినట్టుగా ఉంది.

పరిణితి..వరుడు రాక కోసం..ఎంతో ఆత్రంగా ఎదురు చూడడం, అపుడు..ఆ వరుడు అల్లంత దూరాన కనిపించే ప్యాలెస్ నుంచి ప‌డ‌వ‌లో వైభ‌వంగా ప్ర‌యాణించి తనకై వెతుక్కుంటూ రావ‌డం..ఆపై విన సొంపైన డోలు భాజాలు మోగడం..ఇక వరుడు వధువుని ఒక చోటికి చేర్చి చుట్టూ ఉన్నవారందరూ సంబ‌రాలు చేసుకోవడం అంతా స్వర్గంలో జరిగినట్టుగా ఉంది. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. పరిణితి..రాఘవ్ ల క్యూట్ మూమెంట్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లవ్లీ కపుల్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ పెళ్లి వేడుకకు రాజకీయా నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో పాటుగా పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. కాగా రేపు (సెప్టెంబర్ 30న) చండీగఢ్‌లో వీరి వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. ఢిల్లీలో రాజకీయ నాయకుల కోసం, ముంబైలో సినీ ప్రముఖల కోసం  రిసెప్షన్ ప్లాన్  చేసినట్లుగా తెలుస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra