పార్ట్టైం జాబ్ స్కాం.. సినిమాకు రేటింగ్ ఇస్తే రూ.76 లక్షలు 

పార్ట్టైం జాబ్ స్కాం.. సినిమాకు రేటింగ్ ఇస్తే రూ.76 లక్షలు 

సైబర్ నేరగాళ్లకు అద్దు అదుపు లేకుండా పోతోంది. రోజుకో కొత్త రకం స్కాంతో యువతను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో కొత్త రకం మోసం బయటకు వచ్చింది. సినిమాలకు రేటింగ్, రివ్యూలు ఇస్తే.. లక్షల్లో డబ్బులిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఓ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.

గురుగ్రామ్, న్యూకాలజీకి ఎమ్మెన్సీ కంపెనీలో పనిచేస్తున్న దివ్య అనే మహిళ పార్ట్ టైం జాబ్ కోసం ఆన్ లైన్ లో వెతికింది. అప్పుడే బిట్ మ్యాక్స్ ఫిల్మ్. కామ్ లో  (Bitmaxfilm.com) సినిమాలకు రివ్యూలు రాస్తే లక్షల్లో డబ్బు సంపాదించొచ్చు అని చదివింది. అందులో రోజు కొన్ని సెట్స్ ఉంటాయి.. అందులో రోజుకు 28 సినిమాలకు రేటింగ్ రాస్తే సరిపోతుందని రూల్స్ పెట్టి నమ్మించారు. 

పార్ట్ టైంలో జాయిన్ కావాలంటే.. మొదటి డిపాజిట్ గా రూ.10,500 కట్టాలని, వర్క్ అయిపోయిన తర్వాత వాటిని డిపాజిట్ చేసుకోవచ్చని నమ్మించారు. వాళ్లు చెప్పినట్టే కొన్ని సెట్స్ వరకు డబ్బు డిపాజిట్ చేయించుకొని.. పనిపూర్తయ్యాక సాలరీతో కలిపి డిపాజిట్ చేశారు.

అలా దివ్యతో 35 సెట్స్ వరకు రూ. 9,59,357 డబ్బు కట్టించుకొని.. కొంత కాలానికి సాలరీ వేయకుండా కుచ్చుటోపీ పెట్టారు. తన లాగే ఈ ఫ్రాడ్ నిజం అని నమ్మిన ఓ అమ్మాయి మొత్తం రూ.76,84,493 డిపాజిట్ చేసింది. ఆ మొత్తం డబ్బును లూటీ చేసి పారిపోయారు నేరగాళ్లు. వీళ్లలాగే మరికొందరు యువత ఈ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న గురుగ్రామ్ సైబర్ క్రైమ్ పోలీసులు సెక్షన్ 420(చీటింగ్), ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డి కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.