పఠాన్... దీపికా మోషన్ పోస్టర్ రిలీజ్

పఠాన్... దీపికా మోషన్ పోస్టర్ రిలీజ్

స్టార్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొణె తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి సిద్ధమైంది. దీపికా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఈ మూవీకి సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో పాటు దానికి సంబంధించిన ఫొటోలను కూడా షారుఖ్ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో దీపికా చాలా సీరియస్ గా చూస్తూ.. తుపాకీతో లక్ష్యాన్ని గురిపెట్టినట్టు ఉంది. తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ .. మంటల్ని రాజేయడాన్ని ఈ మోషన్ పోస్టర్ లో గమనించవచ్చు. దాంతో పాటు 'నిన్ను చంపడానికి ఆమెకు బుల్లెట్ అవసరం లేదు' అనే క్యాప్షన్ ను కూడా షారుఖ్ రాసుకొచ్చాడు. అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ పోస్టర్.. మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. కాగా ఈ మూవీలో దీపికాతో పాటు షారుఖ్ ఖాన్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక ఇదే తరహాలో బ్యూటీఫుల్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఈ మోషన్ పోస్టర్ ను షేర్ చేసింది. ఈ పోస్టర్ ను షేర్ చేయడంతో పాటు "తడా! పఠాన్. జనవరి 25న హిందీ, తమిళం, తెలుగులో విడుదలవుతోందంటూ" దీపిక ఓ క్యాప్షన్ ను కూడా జత చేసింది. ఇక ఈ పఠాన్‌ సినిమాలో జాన్ అబ్రహం కూడా నటించారు. ఇద్దరు స్టార్ సెలబ్రెటీస్ లతో పాటు మరికొందరు ప్రముఖ నటులు కూడా ఈ మూవీలో నటిస్తుండడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.