వలస కార్మికులకు దినసరి భత్యం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించలేము: సుప్రీం

 వలస కార్మికులకు దినసరి భత్యం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించలేము: సుప్రీం

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని… లాక్ డౌన్ కాలంలో వలస కార్మికులకు కనీస దినసరి భత్యం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. వలస కార్మికులను కేంద్రం ఆదుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ స్వామి అగ్నివేశ్, హర్ష్ మందర్ సామాజిక కార్యకర్తలు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు… రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోర్టులు ఎలా ఆదేశిస్తాయో అర్థం కావడంలేదని తెలిపింది.

రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ పాలించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపింది సుప్రీం కోర్టు. అక్కడ నిధులు ఉన్నా…లేకున్నా ..ఆర్థిక మద్దతు ఇవ్వాలంటూ తాము ఎవరీ ఆదేశించలేమంటూ జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్కే కౌల్, బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం చెప్పింది.