కస్టమైజ్డ్ రాఖీలను కొనేందుకు సిటిజన్ల ఇంట్రెస్ట్

కస్టమైజ్డ్ రాఖీలను కొనేందుకు సిటిజన్ల ఇంట్రెస్ట్

హైదరాబాద్, వెలుగు: అన్నా - చెల్లెళ్ల అనుబంధపు పండుగ రాఖీ. రెండేండ్లుగా రాఖీ షాపింగ్​కు కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఈసారి కరోనా తీవ్రత లేకపోవడంతో పండుగను ఉత్సాహంగా జరుపుకునేందుకు సిటిజన్లు షాషింగ్ చేస్తున్నారు. సాదాసీదా రాఖీల కంటే క్రియేటివ్​గా, కస్టమైజ్డ్​గా ఉన్న రాఖీలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. వారికి తగ్గట్టు ఆఫ్​లైన్ మార్కెట్లు, ఆన్ లైన్ లో డిఫరెంట్ వెరైటీల్లో రాఖీలు, రిటర్న్​ గిఫ్ట్​లు అందుబాటులో ఉన్నాయి. లాకెట్లపై బ్రదర్, భాయ్ వంటి అక్షరాలను రాసి తయారుచేస్తున్నారు.  హ్యాండ్‌‌ మేడ్ ఫొటో ప్రింటెడ్ రాఖీలు, సీడ్‌‌ రాఖీలు ట్రెండీగా వస్తున్నాయి.

అన్నా, తమ్ముడి ఫొటో ఉండేలా లేదా అన్నాచెల్లి, అక్కాతమ్ముడు కలిసి ఉన్న ఫొటోలు రాఖీల మీద వచ్చేలా కస్టమర్లు ప్రింట్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం సీడ్ రాఖీలకు డిమాండ్ ఎక్కువ ఉందని వారు చెప్తున్నారు. వీటిని తయారు చేసేటప్పుడు రాఖీ మధ్యలో ఒక చిన్న సీడ్‌‌ని పెడతామని... పండుగ తర్వాత ఈ రాఖీని తీసి మట్టిలో పెడితే  మొక్క వస్తుందంటున్నారు. రిటర్న్ గిఫ్ట్​లు సైతం ఈసారి మార్కెట్​లో కొత్తగా వచ్చాయని వారు చెప్తున్నారు. ఫొటోలతో చేసిన షీల్డ్‌‌లను, బెస్ట్ సిస్టర్‌‌‌‌ అనే సర్టిఫికెట్లను కస్టమైజ్ చేసి ఇస్తున్నామంటున్నారు.