బంగారు వర్ణం చీరలో జిగేల్ రాణి

బంగారు వర్ణం చీరలో జిగేల్ రాణి

తెలుగింటి బుట్టబొమ్మ..మన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. సీనియర్ రైటర్ సిరివెన్నెల ఏ ముహూర్తాన సామజవరగమన పాటను రాశారో..అప్పటి నుంచి కుర్రాళ్లు..పూజాను చూస్తే పులకరించిపోతున్నారు. ఆమె అందాన్ని చూసి పరవశించిపోతున్నారు.  ఇక రామజోగయ్యశాస్త్రి రాసిన బుట్టబొమ్మ సాంగ్ తో తెలుగింటి బుట్టబొమ్మగా..యువకుల కలల ముద్దుగుమ్మగా మారిపోయిన పూజా హెగ్డె... బంగారు వర్ణం చీరలో మెరిసిపోతుంది. 

అందానికి ..అభినయానికి పూజా హెగ్డె కెరాఫ్ అడ్రస్ . ఆమె ఏ డ్రెస్ వేసినా గార్జియస్. అందుకే తెలుగులో నటించింది 11 సినిమాలే అయినా..పూజాకు మామూలుగా క్రేజ్ పెరగలేదు. తన డ్రెస్సింగ్ తో ఆకట్టుకునే పూజా..ఇప్పుడు గోల్డెన్ సారీతో ..కుర్రకారు మతులు పోగొడుతుంది. బంగారు వర్ణం హాఫ్ సారీలో యువకుల మనసు దోచేసుకుంటోంది. 

తెలుగులో పూజా హెగ్డె ఫస్ట్ మూవీ ఒక లైలా కోసం. 2014 వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయినా..పూజా హెగ్డెకు మాత్రం మంచి గుర్తింపునిచ్చింది. దర్శకనిర్మాతలతో పాటు..హీరోలు ఏముందిరా ఈ భామ అనుకున్నారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ముకుందతో సైలెంట్ హిట్ ను దక్కించుకుంది. అక్కడి నుంచి  తెలుగు, తమిళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడుకి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. 

10 ఏళ్ల కెరియర్ లో చేసింది 17 సినిమాలు. రెండిటిలో ఐటెం సాంగ్స్. అయినా ఈ బుట్టబొమ్మ సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీ అయిపోయింది. అల వైకుంఠపురంలో సినిమాతో మాంచి సక్సెస్ ను అందుకున్న పూజా..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో డిజాస్టర్ ను చవిచూసింది. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్లో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ కాలేదు. కానీ  పూజా హెగ్డే నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. విజయ్‌తో బీస్ట్ ’ చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు పెద్దగా ఆడకపోయినా..పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని చెప్పాలి.

ఐటెం సాంగ్స్ కు ఒకే..
సినిమాల్లో హీరోయిన్ గానే కాదు..ఐటెం సాంగ్స్ కు ఒకే చేప్తోందీ నీలాంబరి.. పూజా. రామ్ చరణ్ రంగస్థలంలో జిగేల్ రాణిగా మెరిసింది. రిసెంట్ గా వచ్చిన ఎఫ్ 3లో లైఫ్ అంటే ఇట్టా ఉండాలంటూ..థియేటర్ ను షేక్ చేసింది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న జిగేల్ రాణి....టాప్ డైరెక్టర్లు, టాప్ హీరోలతో సినిమాలను లైన్లో పెట్టింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహేష్ బాబుతో పూజాకు రెండో సినిమా కాగా..త్రివిక్రమ్ తో ఇది హ్యాట్రిక్ మూవీ. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ లోనూ పూజా దూసుకుపోతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమాలో యాక్ట్ చేస్తోంది పూజా. ఈ మూవీలో పూజా హెగ్డే అన్నయ్య పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. అటు రణ్‌వీర్ సింగ్‌తో చేసిన సర్కస్ సినిమా జూలై 15న రిలీజ్ అవనుంది. మొత్తంగా మన బుట్టబొమ్మ..తెలుగు, తమిళం,హిందీలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ..వరుస సినిమాలతో దుమ్ములేపుతోంది.