ప్రభాస్ కల్కి 2898 AD.. కొత్త రిలీజ్ డేట్.. ఎప్పుడంటే?

ప్రభాస్ కల్కి 2898 AD..  కొత్త రిలీజ్ డేట్.. ఎప్పుడంటే?

ఇన్నాళ్లు ప్రాజెక్ట్ K గా పిలువబడుతున్న.. ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకోంది. దీంతో ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది.  మొదట 2024 జనవరి 12న మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించగా..ఇప్పుడు మే 9, 2024కి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. 

ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్(Aswani Dutt)  కు మే 9వ తేదీ అంటే.. చాలా సెంటిమెంట్ కలిగి ఉన్నారని..గతంలో ఆయన వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు 'జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాలు మే 9న విడుదల అవ్వటమే ఇందుకు కారణమని.. కనుకే   ప్రభాస్ కల్కి 2898 AD మూవీను సైతం మే 9, 2024న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
అంతే కాకుండా రిలీజ్ వాయిదా విషయంలో.. మరో కారణం కూడా వినిపిస్తోంది.  ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ VFX నాణ్యత కోసం సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయబడిన విషయం తెలిసేందే. అందుకుగాను ఈ మూవీ టీం..ప్రేక్షకులకు సాధ్యమైనంత VFX విజువల్ ను   అందించడానికి మేకర్స్ మరింత సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

రీసెంట్ గా జూలై 20న అమెరికాలోని ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ లో మూవీ టైటిల్..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని,దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్,  రానా దగ్గుబాటి కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.