పఠాన్ సినిమా వివాదంలో దీపికకు మద్దతుగా ప్రకాశ్ రాజ్

పఠాన్ సినిమా వివాదంలో దీపికకు మద్దతుగా ప్రకాశ్ రాజ్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెకు మద్దతుగా ప్రకాశ్ రాజ్ నిలబడ్డాడు. షారుఖ్ ఖాన్ తో నటించిన పఠాన్ సినిమా బేషరమ్ అనే పాటలో దీపిక ధరించిన దుస్తులు విషయం ఈ మధ్య వివాదాస్పదం అయింది. సినిమాను బ్యాన్ చేయాలని పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. # బిగోట్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే, దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ ఫీఫా వరల్డ్ కప్ లో దీపిక ట్రోఫీని ఆవిష్కరించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి సపోర్ట్ గా నిలబడ్డాడు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీ విషయంలో ఈ బిగోట్స్ ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ని బ్యాన్ చేస్తారా!’ అని రాసుకొచ్చాడు.

అయితే, ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు దీపిక ట్రోఫీని ఆవిష్కరించింది. ఫిఫా చరిత్రలో ఇలా ఓ నటికి ట్రోఫీని లాంచ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. దీపిక ట్రోఫీని లాంచ్ చేయడం భారతదేశానికి దక్కిన గర్వకారణం అని చెప్పుకొచ్చాడు.