మిస్టరీ మ్యాన్.. ప్రియుడి ఫొటో షేర్ చేసిన ఇలియానా.. కానీ

మిస్టరీ మ్యాన్.. ప్రియుడి ఫొటో షేర్ చేసిన ఇలియానా.. కానీ

ఇటీవలే గర్భవతి అయిన హీరోయిన్ ఇలియానా డి క్రజ్ తన మిస్టరీ మ్యాన్‌కి సంబంధించిన మరో ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ వ్యక్తి, కుక్కపిల్లను పట్టుకున్నట్టుగా ఉన్న ఓ పిక్ ను ఆమె షేర్ చేసింది. ఇలియానా ఆ వ్యక్తి ఫోటోను షేర్ చేసింది కానీ అతని ముఖాన్ని మాత్రం చూపించకుండా జాగ్రత్తపడింది. దాంతో పాటు అతను తన కుక్కను ప్రేమిస్తున్నాడని ఆమె ఫొటోలో రాసుకొచ్చింది.

ఈ ఫొటోలో ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా కుక్కకు ముద్దులు పెట్టడం కనిపించింది. ఈ ఫొటోను పంచుకుంటూ, "కుక్కపిల్లపై ప్రేమ" అని రాసుకొచ్చింది, మరొక ఫోటోలో.. ఆమె వారి కోసం డిన్నర్ రెడీ చేసినట్టు వెల్లడించింది, ఈ ఫొటోలో ఆమె తన బేబీ బంప్‌ను స్పష్టంగా చూపించింది.

ఇలియానా తాను భోజనం వండేటప్పుడు పూర్తిగా తెల్లటి దుస్తులను ధరించినట్లు వెల్లడించింది. " సెల్ఫ్ నోట్.. టమాటో సాస్ వండేటప్పుడు తెల్లటి పైజామా ధరించాలనుకోకండి" అని ఆమె తన టొమాటో ప్యాచ్‌ల ఫొటోను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.