మార్కెట్లోకి 2-DG కోవిడ్ డ్రగ్.. ధర రూ.990

మార్కెట్లోకి 2-DG  కోవిడ్ డ్రగ్.. ధర రూ.990

కరోనా చికిత్స కోసం DRDO తయారు చేసిన 2-DG యాంటీ కోవిడ్ డ్రగ్ ధరను ఖరారు చేసింది రెడ్డీస్ లాబోరేటరీస్. మార్కెట్ లో ఒక్క సాచేట్ ధర రూ. 990 గా నిర్ణయించింది. ఐతే ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీపై అందిస్తామని ప్రకటించింది. మే నెల ప్రారంభంలో 2-DG డ్రగ్ కు ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఇచ్చింది DCGI.  నిన్న పది వేల సాచెట్స్ విడుదల చేశారు. రెడ్డీస్  ల్యాబోరేటరీస్  సహకారంతో  DRDO ల్యాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్  న్యూక్లియర్  మెడిసిన్ అండ్  అల్లాయిడ్  సైన్సెస్ ఈ డ్రగ్ ను తయారు చేసింది. ఈ డ్రగ్ హాస్పిటల్ లో  చేరిన పేషంట్లు  త్వరగా రికవరీ  అయ్యేందుకు  ఉపయోగపడుతుందని ప్రకటించింది రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ డ్రగ్  పౌడర్ రూపంలో  ఉంటుందని, దీన్ని వాటర్ లో కలిపి  ఇవ్వొచ్చని  తెలిపింది. ఇది వైరస్  సోకిన కణాలలోకి   చేరి ....వైరస్ ఉత్పత్తిని  తగ్గిస్తుందని చెప్పింది.