పది రోజులుగా రోజు పెరుగుతున్న పెట్రోల్ ధర

పది రోజులుగా రోజు పెరుగుతున్న పెట్రోల్ ధర

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ( మంగళవారం) కూడా రేట్లు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 47 పైసలు, డీజిల్‌పై లీటరుకు 93 పైసలు పెరిగాయి. పది రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.5.47, డీజిల్‌ ధర రూ.5.80 పెరిగింది.

పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు…

హైదరాబాద్ : పెట్రోలు ధర  రూ.79.65, డీజిల్  రూ.73.49
అమరావతి : పెట్రోలు ధర  రూ. 80.11 డీజిల్  రూ.73.97
ఢిల్లీ : పెట్రోలు ధర  రూ. 76.73, డీజిల్  రూ.75.19
ముంబై :  పెట్రోలు ధర  రూ. 83.62, డీజిల్  రూ.73.75
చెన్నై: పెట్రోలు ధర  రూ. 80.37, డీజిల్  రూ.73.17

కోల్‌కతా: లీటరు పెట్రోలు రూ.78.55, డీజిల్ ధర రూ.70.84గా ఉంది.

రాబోయే కొద్ది రోజుల్లో ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది.