బాలీవుడ్‌లో రాజకీయాలతో విసిగిపోయా.. : ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌లో రాజకీయాలతో విసిగిపోయా.. : ప్రియాంక చోప్రా

బాలీవుడ్ ను వదిలేసి హాలీవుడ్ కి వెళ్లాలనన్న నిర్ణయంపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వివరణ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని రాజకీయాలతో విసిగిపోయానని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పరిశ్రమలో (బాలీవుడ్) ఒక మూలకు నెట్టివేశారని, కొందరు తనకు ఆవకాశాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాలీవుడ్ ను వీడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలోనే హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందన్న ఆమె.. దాన్ని సద్వినియోగం చేసుకున్నానన్నారు.  ఓ పోడ్ కాస్ట్ కోసం డాక్స్ షెఫర్డ్ తో ప్రియాంక ఈ విషయాలను పంచుకున్నారు.

సాత్ ఖూన్ మాఫ్ సినిమా చిత్రీకరణలో ఉన్న సమయంలో తనకు ఆచార్య కాల్ చేసినట్టు వెల్లడించింది. అమెరికాలో మ్యూజిక్ కెరీర్ పట్ల ఆసక్తిగా ఉన్నారా? అని అడిగినట్టు వివరించింది. అప్పటికే బాలీవుడ్ తో పలువురితో విభేదాలు వచ్చాయని, అక్కడి రాజకీయాలతో విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో బ్రేక్ కోరుకున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ మ్యూజిక్ తనకు ప్రపంచంలో మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం కల్పించిందన్న ప్రియాంక.. ఆ ఇష్టంతోనే అమెరికాకు వచ్చానని తేల్చి చెప్పారు.