జాక్ పాట్ కొట్టింది : సింధుకు 50 కోట్ల డీల్

జాక్ పాట్ కొట్టింది : సింధుకు 50 కోట్ల డీల్

‌‌‌‌‌‌‌న్యూఢిల్లీ: ఆటలో దూసుకెళ్తున్న ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు ఆర్జనలోనూ ఎదురులేకుండా సాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న సింధు ఖాతాలో మరో ఖరీదైన బ్రాండ్‌‌‌‌‌‌‌‌ చేరింది. చైనీస్‌‌‌‌‌‌‌‌ స్పో ర్ట్స్‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ లీ నింగ్‌ .. రూ.యాభై కోట్లతో సింధుతో నాలుగేళ్ల స్పో ర్ట్స్‌ స్పా న్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌ డీల్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. నెలలోనే కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌తో నాలుగేళ్ల ఒప్పం దం కోసం 35 కోట్లు ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేసిన లీ నింగ్‌ .. ఒలింపిక్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాం పియన్‌‌‌‌‌‌‌‌షిప్‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌ సింధు కోసం రికార్డు స్థాయి రేటు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

“ఇది ప్రపంచ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌లో అతి పెద్ద డీల్స్‌‌‌‌‌‌‌‌లో ఒకటి. సిం ధు స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌ కింద 40 కోట్లు , ఎక్విప్‌ మెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం మరో పది కోట్లు అందుకుంటుంది. ఇయర్‌‌‌‌‌‌‌‌ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌ లెక్కన టీమిండి యా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ పూమాతో కుదుర్చుకున్న డీల్‌‌‌‌‌‌‌‌కు ఇది సమానమ’ని ఇండియాలో లీ నిం గ్‌ భాగస్వామి అయిన సన్‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌ స్పో ర్ట్స్‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ మహేందర్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. 2017లో పూమాతో ఎనిమిదేళ్లకు గాను కోహ్లీ వంద కోట్లకు ఒప్పం దం చేసుకున్నాడు. ఆ లెక్కన కోహ్లీ ఏడాదికి 12.5 కోట్లు అందుకోనుండగా… సింధుకు లీ నింగ్‌ పది కోట్లు ముట్టజె ప్పనుంది. ఈ తెలుగు షట్లర్‌‌‌‌‌‌‌‌ను లీ నింగ్‌ తన బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఎంచుకోవడం ఇది రెండోసారి.

2014–15లో ఏడాదికి 1.25 కోట్లు మాత్రమే చెల్లించింది. కానీ, 2016 ఒలిం పిక్స్‌‌‌‌‌‌‌‌లో మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గడంతో సిం ధు స్టార్‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా పెరిగింది. మూడేళ్ల కాలంలో ఆమె అనేక విజయాలు సాధిం చడంతో బ్రాండ్‌‌‌‌‌‌‌‌ వాల్యూ కూడా అమాంతం పెరిగింది. 2016లో ఏడాదికి 3.5 కోట్లతో మూడేళ్లకు గాను సింధుతో యోనెక్స్‌‌‌‌‌‌‌‌ ఒప్పం దం కుదుర్చుకుం ది. దానికి పది రెట్లు ఎక్కువగా చెల్లించేందుకు లీ నింగ్‌ రెడీ అవడం విశేషం.