ఇప్పట్లో ప్రభాస్ సినిమా రిలీజ్ లేనట్లే

ఇప్పట్లో ప్రభాస్ సినిమా రిలీజ్ లేనట్లే

హైదరాబాద్: బాహుబలి సిరీస్‌తో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి పాపులారిటీ సంపాదించాడు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆయన ఇమేజ్ ఆకాశమంత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి వచ్చే తదుపరి సినిమా కోసం వెయిట్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. అయితే ఇప్పుడప్పుడే తెరపై డార్లింగ్ కనిపించే చాన్సులు లేవు. రిలీజ్‌ డేట్ ప్రకటించిన ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ వెనక్కి వెళ్లడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. 

జూలై 30న విడుదల కావాల్సిన రాధేశ్యామ్.. సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉండటంతో వెనక్కి తగ్గింది. మూడో వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో ఏకంగా సంక్రాంతికి రిలీజ్ డేట్‌ పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. ‘నేను నటించిన రొమాంటిక్ మూవీని అందరూ చూడాలని ఎదురు చూస్తున్నా. రాధేశ్యామ్‌కు కొత్త విడుదల తేదీని ఖరారు చేశాం. ఈ మూవీ 2022వ సంవత్సరం జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది’ అని ప్రభాస్ పోస్ట్ చేశారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)