ఆమెతో లవ్​ నిజమే : రాఘవ్​ చద్దా

ఆమెతో లవ్​ నిజమే : రాఘవ్​ చద్దా

ఆప్​ ఎంపీ రాఘవ్​ చద్దా, పరిణీతి చోప్రాల ప్రేమాయణం హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై రాఘవ్​ స్పందించాడు. పరిణీతితో లవ్​ నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరి పరిచయం, ప్రేమ మొదలైన విషయాలపై సెపరేట్​గా ఓ వీడియో రిలీజ్​ చేస్తానని తెలిపాడు. 

కొంత కాలంగా ఈ జంట ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో బాలీవుడ్​ మీడియా ఫోకస్​ పెట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పరిణీతి తాను ఎవరినైనా ప్రేమిస్తాను కానీ, రాజకీయ నాయకుల జోలికి వెళ్లను అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ వీడియోను నెటిజన్లు వైరల్​ చేస్తున్నారు.