హర్యానాలో రైతులపై పోలీసుల లాఠీచార్జి సిగ్గుచేటు

హర్యానాలో రైతులపై పోలీసుల లాఠీచార్జి సిగ్గుచేటు

హర్యానాలో రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీలు చార్జి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతు రక్తం మరోసారి చిందిందని, ఇది దారుణమన్నారు. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. రక్తసిక్తమైన దుస్తులతో ఉన్న ఓ రైతు ఫొటోను కూడా రాహుల్ షేర్ చేశారు.

కర్నాల్ తో రైతులు ఇవాళ(శనివారం) హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభకు దారితీసే రోడ్లను, జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. దాంతో పోలీసులు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. దాంతో పెద్ద సంఖ్యలో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.