ఇవాళ దేశ వ్యాప్తంగా రైతుల రైల్ రోకో

ఇవాళ దేశ వ్యాప్తంగా రైతుల రైల్ రోకో

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ ఇవాళ దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు రైల్ రోకో నిర్వహించాలని నిర్ణయించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు రైతు సంఘాల నేతలు. రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం చేయోద్దని పిలుపునిచ్చారు.  లఖింపూర్ ఘటనలో అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా నిందితుడిగా ఉన్నాడు. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించడం సహా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. అలా ఐతేనే బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరుగుతుందంటున్నాయి. లఖింపూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఘటన జరిగిన సందర్భంలో కారులో తన కొడుకు ఆశిశ్ మిశ్రా లేడని అజయ్ మిశ్రా చెప్తున్నారు.