రైలు ప్రయాణీకులకు స్వల్ప ఊరట

రైలు ప్రయాణీకులకు స్వల్ప ఊరట

రైలు ప్రయాణీకులకు స్వల్ప ఊరట లభించింది. ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై సర్వీసు ఛార్జీ వేయడంపై వచ్చిన విమర్శలకు రైల్వే శాఖ స్పందించింది. భోజనం, పానీయాలపై ఆన్ బోర్డు సర్వీసు చార్జీలను తొలగించింది. అయితే.. స్నాక్స్, లంచ్, డిన్నర్ ధరలపై అదనంగా రూ. 50 వసూలు చేస్తారు. రన్నింగ్ ట్రైన్ లో టీ, కాఫీ అయినా కేవలం రూ. 20 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయంలో ఆహారాన్ని ఆర్డర్ చేసే సమయంలో అదనంగా రూ. 50ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC) వసూలు చేసేది. ఇటీవలే సర్వీసు ఛార్జీకి సంబంధించిన బిల్లులు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. రైల్వే బోర్డు కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. 

ప్రస్తుతం జారీ చేసిన సర్క్యూలర్ తర్వాత రాజధాని, దురం, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణీకులు భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకోని వారు టీ కోసం రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఫుడ్ ఐటమ్స్ కు రూ. 50 సర్వీసు ఛార్జీ కొనసాగుతుందని వెల్లడించింది. టికెట్ బుక్ చేసుకొనే సమయంలో కేటరింగ్ సర్వీసులను ఎంపిక చేసుకోని ప్యాసింజర్స్ లకు ఫుడ్ ఆర్డర్ చేయడం ఖరీదుగా ఉండేది. రన్నింగ్ రైళ్లలో కేటరింగ్ సర్వీసు నుంచి ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేస్తే.. అదనంగా రూ. 50 సర్వీసు చార్జీని చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకొనేటప్పుడు ఈ సర్వీసులను ఎంపిక చేసుకుంటే మాత్రం వీటికి తక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది.