Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!

Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా..  అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ(Ananya Nagalla) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నటిగానే కాదు సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్లామర్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేయడం ఈ అమ్మడు అలవాటు. మొన్నటివరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆవకాశాలు దక్కించుకుంది. అలా ప్లే బ్యాక్, వకీల్ సాబ్, తంత్ర వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అయితే.. తాజాగా అనన్య నాగళ్ల గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. అనన్య కేవలం నటి మాత్రమే కాదు మంచి రైటర్ కూడా. అవును.. ఆమె హీరోయిన్ గా వచ్చిన మల్లేశం సినిమా దర్శకుడు రాజ్ రాచకొండ హిందిలో 8 ఎంఎం మెట్రో సినిమా సినిమా చేశారు. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ జంటగా వచ్చిన ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచింది. ఈ సినిమా స్టార్టింగ్ లో స్పెషల్ థాంక్స్ టూ అనన్య నాగళ్ళ అని వేశారు దర్శకుడు రాజ్ రాచకొండ. ఎందుకంటే.. ఈ సినిమా కథా విషయంలో అనన్య హెల్ప్ చేసిందట. ఇదే విషయాన్ని అనన్యనే స్వయంగా తెలిపారు.

దాంతో.. ఈ విషయం తెలిసిన అనన్య ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియా వైదికగా రియాక్ట్ అవుతున్నారు. గ్లామర్ మాత్రమే కాదు.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తునారు. ఇక అనన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పొట్టెల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు సాహితి మోత్కూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యువ చంద్ర హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.