వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా హాట్ టాపిక్‌గా (Viral) మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళ తన భర్తను కుర్కురే ప్యాకెట్‌ తీసుకురమ్మని అడిగింది. రోజూ అదే తంతు, ఒకటి కాదు రెండు కాదు. కానీ పెళ్లై ఏడాదవుతోంది. తన అలవాటు మానుకోలేదు. అతగాడికి చిర్రెత్తుకొచ్చింది. కుర్కురే ప్యాకెట్లు ఇక నుంచి తెచ్చేది లేదన్నాడు. దాంతో నువ్వు కూడా నా కొద్దు అని భర్తనుంచి విడాకులు కోరింది ఆ మహా ఇల్లాలు.తన అలవాటు కారణంగా దంపతుల మధ్య రోజూ గొడవలు అయ్యేవి. అది కాస్తా పెద్దదై విడాకులకు దారి తీసింది. భర్త చిరుతిండిని ఇంటికి తీసుకురావడం మరచిపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.  భర్త తీరుతో విసిగిపోయిన మహిళ చివరకు అదే రోజు పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తరువాత భర్త నుంచి విడాకులు కోరుతూ పోలీసులను ఆశ్రయించింది . మహిళ చెప్పిన కారణం విని తొలుత పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. చివరకు భార్యాభర్తలను ఫ్యామిలీ కౌన్సిలర్ వద్దకు పంపించారు. అయితే, భర్త తనపై చేయి చేసుకున్నాడని కూడా మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు, తన భార్య కుర్కురేకు బానిస కావడంతో కాస్తంత ఆందోళన కలిగిస్తోందని భర్త వాపోయాడు.

తన రోజువారీ భోగాలను తిరస్కరించినందుకు కోపంతో, ఆ మహిళ తన వివాహిత ఇంటిని విడిచిపెట్టి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అనంతరం తన భర్త నుంచి విడాకులు కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. నివేదిక ప్రకారం, గత సంవత్సరం వివాహం చేసుకున్న ఈ జంటను ఆగ్రాలోని షాగంజ్ పోలీసులు కుటుంబ కౌన్సెలింగ్ కోసం పంపారు. కుర్కురే పట్ల తన భార్య అసాధారణమైన తృష్ణతో తమ మధ్య వివాదానికి దారితీసిందని భర్త తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాడు.