కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

కవిత ఉన్న తీహార్  జైలుకు బాంబు బెదిరింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరించాడు. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పలు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు జైలుకు  చేరుకుని సెర్చింగ్ మొదలుపెట్టారు.  ఫోన్ కాల్ ఎక్కడినుంచో వచ్చిందో తెలుసుకునే పనిలో ఉన్నారు.   అంతకుముందు దేశ రాజధాని ఢిల్లీ లోని నాలుగు ఆసుపత్రులకు  ఈమెయిల్‌లో బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు సహా వివిధ ప్రాంతాలకు ఇలాంటి బెదిరింపులు రావడం నెల రోజుల్లో ఇది నాలుగోసారి. 

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్  కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత  జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో  ఆమెను మే14వ తేదీ మంగళవారం రోజున వర్చువల్ గా  కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు.  మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే వారం రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 8వేల పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై విచారిస్తామని ఈడీ తెలిపింది. కాగా ఇప్పటికే  సీబీఐ  కేసులో  కవితకు కోర్టు మే20 వరకు  కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.