భారీ వర్షానికి ఉస్మానియా యునివర్సిటీ కురిసింది…

భారీ వర్షానికి ఉస్మానియా యునివర్సిటీ కురిసింది…

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉస్మానియా యునివరంసిటీలోని హాస్టల్ రూములు కురిశాయి. దీంతో రాత్రి మొత్తం విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ గడిపారు. రాత్రి పడిన వర్షానికి రూంలు అన్ని బాత్ రూం కంటే గోరంగా తయారయ్యాయి. దీంతో విద్యార్థులు జాగారం చేశారు. దీంతో ఓ విద్యార్థి రూంలో కారుతున్న వర్షాపు నీళ్లతో స్నానం చేసి తన నిరసనను తెలిపాడు.  వందేళ్ల చరిత్ర కలిగిన యునివర్సిటిలో ఇలా నీళ్లు కారడం అవమానకరమని అంటున్నారు అక్కడి విద్యార్థులు. అయితే… నిన్న రాత్రి పడిన వర్షానికి నగరంలోని పలు ఏరియాలలోని ఇండ్ల లోపలికి నీళ్లు వచ్చాయి.నిన్న పడిన వర్షం గత వంద సంవత్సరాల తర్వాత అత్యదిక వర్షపాతంగా నమోదైంది.