శిల్పా శెట్టి భర్త పోర్నోగ్రఫీ కేసు: 70 వీడియోలు స్వాధీనం

V6 Velugu Posted on Jul 22, 2021

ముంబై: సినిమా చాన్సుల పేరుతో యువతులను ట్రాప్ చేసి బూతు సినిమాల్లో నటించేలా చేస్తున్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ముంబైలోని కొన్ని హోటళ్లు, ఫామ్‌హౌసుల్లో పోర్న్ సినిమాల షూటింగ్ చేసి, పెయిడ్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు తాజాగా రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామత్‌ నుంచి 70 పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని వేర్వేరు ప్రొడక్షన్ హౌస్‌ల సాయంతో వాటిని ఉమేశ్ షూట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియోలను ఇప్పటికే రాజ్ కుంద్రా యూకేలోని తన కంపెనీ కిన్‌రిన్‌ ద్వారా పోర్న్‌ యాప్స్‌లో రిలీజ్‌ చేశాడా లేదా తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపనున్నారు. రాజ్ కుంద్రాను జులై 23 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో బాధితులందరికీ కూడా నోటీసులు పంపి, వారి నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకుంటామంటున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో పక్కా ఆధారాలు సంపాదించి, అతడితో పాటు ఈ కేసులో నిందితులందరికీ శిక్ష పడేలా చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు. మరోవైపు, ఇప్పటి వరకు రాజ్‌ కుంద్రాతో పాటు అతడి నుంచి రెగ్యులర్‌‌గా పేమెంట్స్ అందుతున్న పలువురి బ్యాంక్ అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సుమారు రూ.7 కోట్లకు పైగా డబ్బు ఆ ఖాతాల్లో ఉన్నట్టు చెప్పారు.

Tagged Bollywood, Porn videos, Crime Branch, Raj Kundra, shilpa shetty, Pornography Case, Porn Shooting

Latest Videos

Subscribe Now

More News