తప్పు చేశా.. ఇబ్బందులు పడుతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని రాజస్థాన్ వాసి సూసైడ్

తప్పు చేశా.. ఇబ్బందులు పడుతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని రాజస్థాన్ వాసి సూసైడ్

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‎కు చెందిన సవాయి సింగ్‎కు టాలీవుడ్ , బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సోహాని కుమారితో ఇన్​స్టాగ్రామ్‎లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల నిశ్చితార్థం జరిగింది. 

కొంతకాలంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాసన్ నగర్‎లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని కలిసి జీవిస్తున్నారు. సవాయి సింగ్‎కు గతంలోనే ఓ ప్రియురాలు ఉంది. ఆమెను మోసం చేశానన్న బాధతో ‘నేను తప్పు చేశా.. తప్పు చేసినందుకు ఇబ్బందులు పడుతున్నా’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోహాని కుమారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.