రకుల్‌ ఛత్రివాలి రిలీజ్ డేట్ ఫిక్స్

రకుల్‌ ఛత్రివాలి రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీలో పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఛత్రివాలి అనే వెబ్ మూవీలో చేస్తోంది. ఈ సినిమాకు తేజాస్‌ ప్రభ విజయ్ డియోస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 20న జీ5 ఒరిజినల్ లో ప్రీమియర్ కానుంది. దీనికి సంబంధించిన ఒ పోస్టర్‌ ను కూడా చిత్ర బృందం విడుదల చేశారు. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పాఠాలు జనవరి 20 నుంచి షురూ అంటూ ప్రీమియర్‌ తేదీ తెలుపుతూ మేకర్స్ వెల్లడించారు.

ఈ వెబ్‌ మూవీలో సుమీత్‌ వ్యాస్‌, సతీశ్‌ కౌశిక్‌, డాలీ అహ్లువాలియా, రాజేశ్‌ తాయిలాంగ్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మంగేశ్‌ ధడ్కే సంగీతం అందిస్తున్నారు.