SECTION 108 Teaser: బాలీవుడ్ స్టార్ యాక్టర్తో రెజీనా..సెక్ష‌న్ 108 టీజర్ రిలీజ్

SECTION 108 Teaser: బాలీవుడ్ స్టార్ యాక్టర్తో  రెజీనా..సెక్ష‌న్ 108 టీజర్ రిలీజ్

టాలీవుడ్ లో కొన్నాళ్ళు బాగా బిజీగా ఉన్న హీరోయిన్ రెజీనా(Regina). ఈ హీరోయిన్‌ పేరు చెప్పగానే సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌  సినిమాలో సీత గుర్తొస్తుంది. అది పక్కా కమర్షియల్‌ సినిమా. జ్యో అచ్యుతానంద, ఎవరు, శాకినీ, డాకినీ మూవీస్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ నుంచి సినిమాలు రాక చాలా కాలం అయింది. టాలీవుడ్లో అవకాశాలు రాక..కోలీవుడ్లో సెటిల్ అయినా ఈ భామ.. హిందీలో తన సత్తా చాటాలని అనుకుంటోంది. 

లేటెస్ట్ గా రెజీనా..బాలీవుడ్ స్టార్ యాక్టర్ న‌వాజుద్దీన్ సిద్దీఖి(Nawazuddin Siddiqui) సెక్ష‌న్ 108 మూవీలో అవకాశం దక్కించుకుంది. ఇవాళ ఆగస్టు 28న  సెక్ష‌న్ 108 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో జరిగే స్కామ్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో రెజీనా ఇన్సూరెన్స్ ఎంక్వైరీ ఆఫీసర్ శిఖా క్యారెక్టర్లో యాక్ట్ చేస్తోంది. ఇన్సూరెన్స్ ఇష్యూ అనేది..సొసైటీలో జరిగే అంశం కాబట్టి.. రెజీనా రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. ఇన్సూరెన్స్ కంపెనీల బిజినెస్ మేన్స్ను ఎదిరించే రోల్ కావడంతో..రెజీనా స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుందని టాక్. 

రెజీనా తెలుగు,తమిళ్,కోలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పటికీ సక్సెస్ రేంజ్కు దూరమైంది. ఇక రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో.. ఐటెం సాంగ్ చేసినప్పటికీ అంత పెద్ద గుర్తింపు రాలేదు. ఇక బాలీవుడ్లో వర్సటైల్ యాక్టర్ అయినా.. న‌వాజుద్దీన్ సిద్దీఖి మూవీలో ఛాన్స్ రావడంతో.. భామ ఫుల్ ఖుషి అవుతుందని సమాచారం. ఇక ఈ మూవీలో న‌వాజుద్దీన్ సిద్దీఖి తో ఘాటైన రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేయటానికి కూడా ఒకే అన్నట్టు తెలుస్తోంది. దీంతో రెజీనా ఫ్యాన్స్ కు డబుల్ ధమాఖా కన్ఫర్మ్ అయినట్టే అని టాక్ వినిపిస్తోంది. న‌వాజుద్దీన్ సిద్దీఖి ఏజ్కి..రెజీనా ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ వెంటనే ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తుందంటే..ఈ అమ్మడు బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది.  

సెక్ష‌న్ 108 మూవీ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.తాహూర్ ఖాన్ అనే బీమా క్లెయిమ్ కన్సల్టెంట్‌గా నవాజ్ యాక్ట్ చేశారు. టీజర్ చాలా ఇంటెన్సివ్ గా ఉండటంతో. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. రాసిఖ్ ఖాన్ డైరెక్షన్ చేయగా..నో ఎంట్రీ, వెల్‌కమ్,భూల్ భూలయ్యా 2 ఫేమ్ అనీస్ బజ్మీ సమర్పిస్తున్నారు.