సీఎం హోదాలో సెక్రటేరియెట్​కు ..గ్రాండ్​ వెలకం చెప్పిన ఉద్యోగులు

సీఎం హోదాలో సెక్రటేరియెట్​కు ..గ్రాండ్​ వెలకం చెప్పిన  ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియేట్​కు వెళ్లారు. సచివాలయంలోని బాహుబలి గేటు దగ్గర పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఎం హోదాలో తొలిసారి సెక్రటేరియెట్ కు వచ్చిన రేవంత్ రెడ్డికి అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మంత్రులతో కలిసి నడుచుకుంటూ లోపలికి వెళ్లిన సీఎం.. ప్రత్యేక లిఫ్టులో ఆరో ఫ్లోర్​లోని తన చాంబర్​కు చేరుకుని సీఎం కుర్చీలో ఆశీనులయ్యారు. అనంతరం తొలి ఫైలుపై సంతకం చేశారు.

ఈ సందర్భంగా సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రేవంత్‌‌ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. మొదటి రోజు అన్ని డిపార్ట్​మెంట్ల స్పెషల్ సీఎస్​లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పలువురు ఐఏఎస్ అధికారులు, ఉద్యోగ సంఘాల లీడర్లు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనాలు పెద్ద ఎత్తున సచివాలయంలోకి వచ్చారు.