మేయర్ ఇంట్లో కుక్కనై పుడతా!

మేయర్ ఇంట్లో కుక్కనై పుడతా!

హైదరాబాద్, వెలుగు: ‘గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంట్లో పెంపుడు కుక్కలా పుట్టాలని ఉంది’ అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురువారం ట్వీట్ చేశాడు. మేయర్ ఇంట్లో ఒకే ప్లేట్ లో తాను తింటూ పెంపుడు కుక్కకి తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వర్మ ఇలా పోస్టు చేశాడు. మేయర్ ప్రజలను కూడా కుక్కల మాదిరిగానే ప్రేమిస్తుందని, నేను కూడా వచ్చే జన్మలో మేయర్ పెంపుడు కుక్కలాగ పుట్టి ఆమె ప్రేమని పొందాలని కోరుకుం టున్నట్లు ట్వీట్  చేశాడు .