ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా

 ఢిల్లీ లిక్కర్ స్కాం :  కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 6న తీర్పు వెలువరించనున్నట్టు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. ఇవాళ్టికి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు మే 6వ తేదీన సీబీఐ, ఈడీ రెండు కోసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పను వెలువరించనున్నట్టు ప్రకటించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఇవ్వాళ తీర్పు వెలువరించనున్న ట్రయల్ కోర్టు.  ఎమ్మెల్సీ కవిత సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. అయితే క‌విత వేసిన బెయిల్ పిటిష‌న్‌పై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరిగాయి. 

ఈ తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ్టికి రిజర్వ్ చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క‌విత‌ను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న‌ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిట‌ష‌న్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందన్నారు. 

అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె పార్టీకి స్టార్ క్యాంపైనర్ అని, ప్రతిపక్షంలో ఉన్నారని  రూలింగ్ లో ఉన్నపుడే ఏం చెయ్యలేదని చెప్పారు. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందని తెలిపారు. ఏడేళ్ల లోపల పడే శిక్షపడే కేసులకు అరెస్ట్ అవసరం లేదన్నారు. అరెస్ట్‌కు సరైన కారణాలు లేవని కవిత తరపున వాదనలు వినిపించారు. అనంతరం సీబీఐ తరపున వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని, కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కలిపి ఈ నెల 6వ తేదీన బెయిల్ పై తీర్పు వెల్లడించనున్నట్టు జడ్జి కావేరి బవేజా తెలిపారు. దీంతో మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.