Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్

Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2(Pushpa 2). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపధ్యంలో పార్ట్ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజున వచ్చిన పుష్ప 2 టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. పుష్ప.. పుష్ప.. అంటూ వచ్చిన ఈ పాట ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆడియన్స్ నుండి కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. తాజాగా ఈ పుష్ప సాంగ్ చూసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో స్పందించారు. తన ట్విట్టర్ లో పుష్ప 2 సాంగ్ ను పోస్ట్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్.. సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని ఉంది.. అంటూ రాసుకొచ్చాడు. దానికి స్పందించిన అల్లు అర్జున్.. చాలా సులభం.. మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ద్వారా ఇండియాలో చాలా ఫేమ్ అయ్యాడు ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్. టిక్ టాక్ లో మన తెలుగు పాటలకు వీడియోస్ చేస్తూ ట్రెండ్ అయ్యారు. ఇక 2021లో వచ్చిన పుష్ప సినిమాలోని పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. అనే వీడియో చేసి ఫుల్ పాపులర్ అయ్యారు వార్నర్. ఇక తాజాగా పుష్ప 2 సాంగ్ పై స్పందించి మరోసారి ట్రెండ్ అయ్యారు.