Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?

Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ కూలి(Coolie). తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kananidhi Maran) తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ టీజర్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. రజినీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కూలి చిత్ర యూనిట్ కు షాకిచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. కారణం ఏంటంటే.. కూలి మూవీ టీజర్ లో అనుమతి లేకుండా ఇళయరాజా పాటను వాడారట. రజినీకాంత్ నటించిన తంగమగన్ సినిమాలోని వా వా పక్కం వా అనే పాటను కూలి టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వినిపించింది. ఈ సినిమాకు మ్యూజిక్ చేసింది ఇళయరాజానే. అందుకే.. తన అనుమతి లేకుండా తన సినిమాలోని పాటను వాడారని చిత్ర యూనిట్ కు నోటీసులు పంపారు ఇళయరాజా. అందువల్ల.. వెంటనే తన పాటను కూలి టీజర్ నుండి తొలగించాలని, లేదంటే యూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ఇళయరాజా పంపిన నోటీసులపై సన్ పిక్చర్స్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇక కూలి సినిమా విషయానికి వస్తే.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాల.ఓ రజినీకాంత్ కూతురిగా శృతి హాసన్ కనిపించనున్నారట. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.