రిలయన్స్‌‌కు 3 వేల కోట్ల ఫైన్?

రిలయన్స్‌‌కు 3 వేల కోట్ల ఫైన్?

కేజీ–డీ6 కేసులో రూ.3 వేల కోట్ల ఫైన్ పడే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీ అంచనావేస్తోంది. తొమ్మిదేళ్లుగా ప్రభుత్వానికి, రిలయన్స్‌‌కు మధ్య ఈ వివాదం నడుస్తోంది. కేజీ –డీ6 విషయంలో  ఇన్వెస్ట్‌‌మెంట్ల ప్లాన్‌‌కు లోబడి ఉండటంలో రిలయన్స్ ఫెయిల్ అయినట్టు ఆరోపణలున్నాయి. అనుమతించిన డెవలప్‌‌మెంట్ ప్లాన్‌‌ను రిలయన్స్ పాటించలేదని ప్రభుత్వం చెప్పింది. ఈ కేసును అర్బిట్రేషన్‌‌కు పంపింది. మెగా రైట్స్ ఇష్యూ ఆఫర్ డాక్యుమెంట్‌‌లో కేజీ–డీ6 బ్లాక్‌‌ విషయంలో తనకు, తమ పార్టనర్లకు ప్రభుత్వం నోటీసులు పంపినట్టు ఈ కంపెనీ ఒప్పుకుంది. డెవలప్‌‌మెంట్ ప్లాన్ అమలు చేయకుండా కెపాసిటీని తక్కువ వాడుకున్నందుకు గాను, కాస్ట్ రికవరీకి అనుమతించడం లేదని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాక పెట్రోలియం లాభంలో అదనంగా షేరును డిమాండ్ చేస్తోందని రిలయన్స్ చెప్పింది. అయితే ప్రభుత్వం కాస్ట్ ఆఫ్ రికవరీ అనుమతించకపోవడానికి కేజీ–డీ6 కాంట్రాక్ట్‌‌లో ఎలాంటి ప్రొవిజన్లు లేవని రిలయన్స్ అంటోంది. 2011 నవంబర్‌‌‌‌లోనే తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బిట్రేషన్ నోటీసు వచ్చినట్టు రిలయన్స్ తెలిపింది. కేజీ–డీ6 పీఎస్‌‌సీకి చెందిన కాస్ట్ రికవరీ ప్రొవిజన్ల విషయంలో వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇరు వర్గాలు ఈ కేసుకు సంబంధించిన వాదనలను ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్‌‌ ట్రిబ్యునల్‌‌ ముందు ఉంచాయి. తుది విచారణలు 2021 సెప్టెంబర్‌‌‌‌ నుంచి డిసెంబర్‌‌ మధ్యలో జరిగే అవకాశం ఉంది.

స్టూడెంట్లందరూ ప్రమోట్