ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలంలో రూ.136 కోట్లు వసూలు

ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలంలో రూ.136 కోట్లు వసూలు

67మందిలో చెల్లించింది 56 మంది

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో ప్లాట్లను దక్కించుకున్న కొనుగోలుదారులు డబ్బులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఫేజ్-2లోని మల్టీజోన్ 67 ప్లాట్ల వేలాన్ని గత నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పాట్లను కొనుగోలు చేసిన వారు ఈనెల 23లోపు వేలంలో పాడిన మొత్తంలో 25 శాతం డబ్బులు చెల్లించాల్సి ఉంది. దీనిలో భాగంగా ప్లాట్లు దక్కిం చుకున్న 67మందిలో 56 మంది సదరు సంస్థ సూచించిన నిబంధనల ప్రకారం మొదటి విడతగా డబ్బులు చెల్లించారని అధికారులు చెప్పారు.

కొనుగోలుదారులు చెల్లించిన డబ్బులతో హెచ్ ఎండీఏకు ప్రస్తుతానికి రూ.136 కోట్లు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. మిగత 11మంది విష-యాన్ని హెచ్ ఎండీఏ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు.ఉన్నతాధికారుల నిర్ణయంతో దీనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలుదారులంతా 60 రోజుల్లో ప్లాట్లకు సంబంధించి న మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెచ్ ఎండీఏ వర్గాలు సూచిస్తున్నాయి.