
సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. అయితే ఆ సినిమా కంటే ముందే అట్లీ నిర్మిస్తున్న చిత్రంలో సల్మాన్ నటించబోతున్నాడు. ‘బేబీ జాన్’ టైటిల్‌తో వరుణ్ ధావన్ హీరోగా ఓ హిందీ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి అట్లీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వామికా గబ్బి మరో హీరోయిన్. కాలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులోనే సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చే ఆ సీన్స్‌ను ఆగస్టులో షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తమిళ హీరో విజయ్‌తో అట్లీ తీసిన తమిళ చిత్రం ‘తేరి’కి ఇది రీమేక్. తమన్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయనున్నారు.