రైతులకు మద్దతుగా ఆకు పచ్చ కండువాతో సంజయ్ పాదయాత్ర 

రైతులకు మద్దతుగా ఆకు పచ్చ కండువాతో సంజయ్ పాదయాత్ర 

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చేవెళ్లకు వెళ్తూ మధ్య మధ్యలో రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోని రైతులను కలిసి మాట్లాడారు. వారి  సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండిసంజయ్.  రైతులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని..దీంతో  పాటు పండిస్తున్న కూరగాయలకు, పూలకు అతి తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఫిర్యాదు. TRS అధికారంలోకి రాకముందు కేసీఆర్ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారని..అవి అమలు పరచలేదని తెలిపారు. ముఖ్యంగా రైతు పండించే పంట రైతు ఇంటి దగ్గరనే అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని హామీలు ఇచ్చిండని సంజయ్ కి తెలిపారు రైతులు.

ఒక బాక్స్ టమాటా వంద రూపాయలకు.. ఒక సంచి వంకాయలు 70 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సజ్జన పిల్లి దగ్గర సిమెంట్ పోల్స్ కార్మికుల తో మాట్లాడిన తర్వాత గులాబి పూలు పండిస్తున్న రైతులతో మాట్లాడిన బండి సంజయ్.. రైతులతో కలిసి కలుపు తీశారు.