సింగర్ సోనూ నిగమ్‌ పై దాడి

 సింగర్ సోనూ నిగమ్‌ పై దాడి

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌ పై దాడి జరిగింది. ముంబైలో  చెంబూర్ లో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తుండగా కొందరు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీనికి సోనూ బాడీ గార్టులు నిరాకరించడంతో వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సోనూ కూడా గాయపడ్డాడు. దీంతో ఆయనను వెంటనే జెన్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గతేడాది సోనూకు పద్మశ్రీ అవార్డు వచ్చింది.