పెరుగుతున్న పెట్రోల్ బంకుల మోసాలు

పెరుగుతున్న పెట్రోల్ బంకుల  మోసాలు

రాష్ట్రంలో లూజ్ పెట్రోల్ ఎక్కడపడితే అక్కడ దొరుకుతోంది. పెట్రోల్ బంకుల్లో వెహికిల్స్ లో మాత్రమే పోయాల్సి ఉన్నా.... బాటిల్స్ లో తీసుకెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ఘటనల్లో...లూజ్ పెట్రోల్  తీసుకెళ్ళికొనుక్కొని వెళ్లడంతోనే ఘటనలు రుజువుచేస్తుండగా..యాక్షన్ తీసుకోవడంలో ఆయిల్ కంపెనీలు, అదికారులు ఫెయిల్ అవుతున్నారు. 

రోజు రోజుకు ఫ్యూయల్ వాడకం పెరుగుతుండటంతో.... పెట్రోల్ బంకుల నిర్వాహకుల మోసాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిపై లీగల్ మెట్రాలజీతో పాటు ఆయిల్ కంపెనీలు నిఘా పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. బంకుల్లో లూజ్ గా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. విడిగా పెట్రోల్ కొనుక్కొని వెళ్ళి... సూసైడ్ అటెంట్ట్ చేస్తున్నట్టు కేసులు నమోదవుతున్నాయి. అయితే వెహికిల్ మధ్యలో ఆగిపోవడంతో నెట్టుకుంటూ రాలేక... బంకుకు బాటిల్ తెస్తున్నారని పెట్రోల్ బంకు సిబ్బంది చెబుతున్నారు. 

బాటిల్స్ లో పెట్రోల్ తెచ్చుకున్న కొందరు.. కాలనీలు, బస్తీల్లో పెట్టుకొని అమ్ముతున్నారు. ఇలా అమ్మకూడదని రూల్స్ ఉన్నా... పోలీసులు, ఆయిల్ కంపెనీలు సీరియస్ గా దృష్టి పెట్టడం లేదంటున్నారు. ఫ్యూయల్ అమ్మకాల్లో క్వాలిటీ, క్వాంటిటీపై లీగల్ మెట్రాలజీ డిపార్ట్ మెంట్ భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4 వేల 535 పెట్రోల్ బంకులు ఉంటే...ఈ యేడాదిలో 251 పైగా కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.  
 
పెట్రోల్, డీజిల్ పోయించుకున్నప్పుడు.. అనుమానం వస్తే క్వాలిటీ, క్వాంటిటీ చెక్ చేయించుకునే హక్కు వినియోగదారుడికి ఉందని అధికారులు తెలిపారు. నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవాలన్నారు. లూస్ పెట్రోల్ పై ఫిర్యాదులు వస్తున్నాయనీ... ఆయిల్ కంపెనీలు సీరియస్ గా దృష్టి పెట్టాలని తెలిపారు. ఫ్యూయల్ తో పాటు, ఏ ఇతర తూనికలు, కొలతల సమస్యలు ఉన్నా733 077 4444 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. 

కొన్ని పెట్రోల్ బంకులను యజమానులు నడపకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. లూజ్ పెట్రోల్ కోసం వచ్చే వారి మానసిక స్థితిని కూడా బంకుల సిబ్బంది గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.