ఆస్ట్రేలియన్​ ఓపెన్‌‌‌‌‌‌‌‌కు సెరెనా దూరం

ఆస్ట్రేలియన్​ ఓపెన్‌‌‌‌‌‌‌‌కు సెరెనా దూరం

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: అమెరికా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ సెరెనా విలియమ్స్‌‌‌‌‌‌‌‌.. సీజన్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టోర్నీ ఆస్ట్రేలియన్​ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఆడటం లేదు. మెడికల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సలహా మేరకు ఆమె టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఆర్గనైజర్స్​ వెల్లడించారు. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రౌండ్​లో ఓడిన 40 ఏళ్ల సెరెనా.. ఆ తర్వాతి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నది. దీంతో అమెరికన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ 41వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. కాగా, మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగనున్నాడు. టోర్నీకి వచ్చే ప్లేయర్లు, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌, అఫీషియల్స్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా కొవిడ్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని ఆర్గనైజర్స్‌‌‌‌‌‌‌‌ స్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ పెట్టడంతో జొకో ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేదని వార్తలు వచ్చాయి. స్పెయిన్‌‌‌‌‌‌‌‌ బుల్‌‌‌‌‌‌‌‌ నడాల్‌‌‌‌‌‌‌‌ తన ఎంట్రీని కన్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేయగా, గాయం వల్ల  ఫెడరర్‌‌‌‌‌‌‌‌ రావడం లేదు.