సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న షారూఖ్, విరాట్ ఫ్యాన్స్

సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న  షారూఖ్, విరాట్ ఫ్యాన్స్


షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.  సీని రంగంలో షారుఖ్ ఖాన్ కింగ్ అని, క్రికెట్ లో విరాట్ కోహ్లీ కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. షారుఖ్ సినిమా ‘రబ్ నే బనా ది జోడి’తో విరాట్ భార్య అనుష్క శర్మ సినీ పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి స్లార్ల  మధ్య మంచి స్నేహమే ఉంది. కానీ వీళ్ల అభిమానులు మాత్రం మా స్టార్ గొప్ప అంటే మా స్టార్ గొప్ప అని ట్వీట్లు చేసుకుంటూ చిన్న పిల్లలాగా కొట్టేసుకుంటున్నారు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరుపున ఆడుతున్న కోహ్లీ ఒక్కసారి కూడా ఆ జట్టుకు ట్రోఫీని అందించలేదని షారుఖ్ అభిమానులు ట్వీట్ చేస్తే... విరాట్ కోహ్లీకి షారుఖ్ ఖాన్ ఇన్స్పిరేషన్ అని షారుఖ్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.  ఆస్ట్రేలియాలోని గ్రౌండ్‌లో లక్షమంది జనం ఒకేసారి కోహ్లీ నామజపం చేశారు. దానికి షారుఖ్‌కి 35 సంవత్సరాలు పట్టిందని కోహ్లీ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తే...  ‘ఈ ఒక్క సీన్ విరాట్ కోహ్లీ మొత్తం కెరీర్ కంటే ఎక్కువ’ అని షారుఖ్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.  ఇలా ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఈ ట్వీట్ వార్ ఇంకా పెరుగుతునే ఉంది. అయితే ఇంకొందరు మాత్రం షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ దేశం గర్వించేలా చేసిన ఐకాన్స్  అని పోస్ట్ చేస్తున్నారు. 

ఇంతకీ ఫ్యాన్స్ మధ్య వార్ ఎందుకంటే..

ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పెట్టిన పోల్ వివాదానికి కారణం అయ్యింది. గ్లోబల్ గా షారూఖ్ ఖాన్.. విరాట్ కోహ్లీలో ఎవరు పాపులర్ అని పోల్ పెట్టాడు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ పోటీ పోటీగా ఓట్లు వేయటంతోపాటు.. పర్సనల్ గా తీసుకున్నారు ఈ పోల్ ను. ఓ దశలో విరాట్ కోహ్లీకి 51 శాతం.. షారూఖ్ కు 49 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో షారూఖ్ అభిమానులు మరింత రెచ్చిపోయి ఓటింగ్ కు దిగటంతో పర్సంటేజీలు తారుమారు అయ్యాయి. ఇలా జరుగుతున్న సమయంలో పర్సనల్ కామెంట్స్ దిగుతూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఇద్దరి ఫ్యాన్స్..