సూపర్‌‌‌‌ శిల్పా! : రూ. 10 కోట్ల యాడ్ కు నో చెప్పింది

సూపర్‌‌‌‌ శిల్పా! : రూ. 10 కోట్ల యాడ్ కు నో చెప్పింది

నటీనటులకి సినిమాల వల్ల ఎంత సంపాదన వస్తుందో, యాడ్స్ వల్ల కూడా అంతే వస్తుంది. కొంతమందికైతే యాడ్స్‌‌ వల్లే ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాంటిది పది కోట్లు ఇస్తానన్నా  ఒక యాడ్‌‌ ఫిల్మ్‌‌లో నటించేందుకు ఒప్పుకోలేదు శిల్పాశెట్టి. ఇటీవల ఒక పాపులర్ ఆయుర్వేద కంపెనీ శిల్పను సంప్రదించింది. స్లిమ్‌‌గా అయ్యేందుకు తమ కంపెనీ తయారు చేసిన పిల్‌‌ని ప్రమోట్ చేయమని అడిగింది. దాని కోసం పది కోట్లు ఇస్తా మంది. అయినా సరే చేయను పొమ్మంది శిల్ప.

‘మిమ్మల్ని స్లిమ్‌‌గా చేసేస్తా మంటూ చాలామంది ఇలాగే టెంప్ట్‌‌ చేస్తుంటారు. అది నమ్మి యంగ్‌‌స్టర్స్‌‌ మోసపోతుంటారు. అలాంటివి చూసి కూడా నాకు తెలియని ఒక మందును మింగమని నేనెలా చెబుతాను? అయినా నేనింత ఫిట్‌‌గా ఉండటానికి ఏమైనా వాడానా? కేవలం వ్యాయామం, డైట్‌‌తో మెయింటెయిన్‌‌ చేస్తున్నాను. అందరూ అదే చేయాలి. అవీ ఇవీ వాడి రిస్క్‌‌ తీసుకోకూడదు’ అంటోంది శిల్ప. ఆమె చేసిన పని గురించి విని సూపర్‌‌‌‌ శిల్పా అంటున్నారంతా. ఆ మధ్య కాస్మొటిక్ కంపెనీ ఆఫర్‌‌‌‌ని సాయి పల్లవి కూడా ఇలాగే తిప్పికొట్టింది.  ఇలా ఆలోచించడం నిజంగా గ్రేట్.