కాస్త ఆలస్యమైనా నాగిన్ వచ్చి తీరుతుంది

కాస్త ఆలస్యమైనా నాగిన్ వచ్చి తీరుతుంది

శ్రీదేవి నటించిన చాలా సినిమాలకు సీక్వెల్స్ తీయాలని ఉన్నా.. ఆమెను రీప్లేస్ చేసే నటి దొరకదనే ఉద్దేశంతో మానుకున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఓ రెండు సినిమాల విషయంలో మాత్రం కొందరు ధైర్యం చేసి ముందడుగు వేశారు. ‘చాల్‌‌‌‌‌‌‌‌బాజ్’కి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘చాల్‌‌‌‌‌‌‌‌బాజ్ ఇన్ లండన్’ ప్లాన్ చేశారు. ఇక నాగిన్, నిగాహేలకి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘నాగిన్’ రాబోతోంది. విశేషమేమిటంటే.. ఈ రెండింటిలోనూ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా సెలెక్ట్ కావడం. ‘చాల్‌‌‌‌‌‌‌‌బాజ్ ఇన్‌‌‌‌‌‌‌‌ లండన్‌‌‌‌‌‌‌‌’ వర్క్ స్టార్టయినా.. ‘నాగిన్‌‌‌‌‌‌‌‌’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌ గురించి మాత్రం కొన్నాళ్లుగా ఏ వార్త వినిపించడం లేదు. దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. అది కాస్తా నిర్మాత నిఖిల్ ద్వివేది చెవిన పడటంతో ఇటీవల రియాక్టయ్యాడు. 

‘అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా ఆగిపోలేదు. కాస్త లేటయ్యిందంతే. ఇది భారీ బడ్జెట్ సినిమా. వీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగాలనుకుంటున్నాం. కాస్త ఆలస్యమైనా నాగిన్ వచ్చి తీరుతుంది’ అని చెప్పాడు నిఖిల్. నిజానికి ఇది నాగిన్, నిగాహే చిత్రాలకు సీక్వెల్ కాదని టీమ్ అంటోంది. అయితే ఆ సినిమాల కథకి కొనసాగింపు కాకపోయినా దాదాపు దాని తరహాలోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాగిని పాత్ర అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది శ్రీదేవి మాత్రమే. అలాంటి పాత్ర తాను చేయడం హ్యాపీ అని శ్రద్ధ కూడా చెప్పింది. చేయడం హ్యాపీనే కానీ శ్రీదేవి చేసిన పాత్రను ట్రై చేయడం కాస్త రిస్కే. మరి ఈ చాలెంజ్‌‌‌‌‌‌‌‌ని శ్రద్ధ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.