కరోనా నుంచి కోలుకున్నోళ్లు ఒక్క డోస్ వేస్కున్నా మేలే

కరోనా నుంచి కోలుకున్నోళ్లు ఒక్క డోస్ వేస్కున్నా మేలే


న్యూఢిల్లీ: కరోనా సోకి, కోలుకున్నోళ్లు ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ నుంచి అత్యధికంగా రక్షణ ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ​మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకకుండా ఒకటి లేదా రెండు డోసుల టీకా తీసుకున్నవాళ్ల కంటే.. వైరస్ నుంచి కోలుకుని కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఎక్కువగా రక్షణ ఉంటుందని తేలింది. స్టడీలో భాగంగా.. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసులు తీసుకున్న వాళ్లలో యాంటీబాడీ రెస్పాన్స్ ను పరిశీలించారు. అలాగే కరోనా నుంచి కోలుకుని ఫస్ట్, సెకండ్ డోస్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలోనూ ఇమ్యూన్ రెస్పాన్స్ ను రీసెర్చర్లు స్టడీ చేశారు. దీంతో కరోనా నుంచి కోలుకుని, ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలోనూ వైరస్ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని గుర్తించారు. వీరిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంవల్ల కొత్త డెల్టా వేరియంట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో  ప్రొటెక్షన్ ఉంటుందని తేలినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.