మధురమైన గానం : ఆపకుండా ఆరు గంటలు పాడింది

మధురమైన గానం : ఆపకుండా ఆరు గంటలు పాడింది

హైదరాబాద్ , వెలుగు:  ఓ సాంగ్ పాడాలనుకుంటే మహా అంటే 5 నిమిషాల్లో పాడేస్తాం. ఇంకాస్త పెద్దగా ఉంటే 10 నిమిషాలు అనుకోండి. కానీ ఆపకుండా ఆమె ఆరు గంటలు పాడింది. మధురమైన గానంతో అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీమతి ఆదూరి కళ్యాణ్. ఉపాసన శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ శ్రీమతి వెంపటి హేమ గార్లకు ఉపాసన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత సాహిత్య రచన.. శాస్త్రీయ లలిత భక్తి గీతాలను శ్రీమతి ఆదూరి కళ్యాణ్ ..ఆరు గంటలు నిర్విరామ గానం చేశారు. ఈ సందర్భంగా ఆమె వండర్ బుక్ ఆఫ్ రికార్డును సాధించారు.