త్వరలో రాష్ట్రంలో 80 లక్షల మందికి వ్యాక్సిన్

త్వరలో రాష్ట్రంలో 80 లక్షల మందికి వ్యాక్సిన్
వ్యాక్సిన్ సేఫ్.. భయపడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సెల్యూట్ చేస్తున్నట్టు వెల్లడి హైదరాబాద్​లో వ్యాక్సినేషన్ డ్రైరన్ ను పరిశీలించిన గవర్నర్ హైదరాబాద్, వెలుగు: కరోనాకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సురక్షితమని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని గవర్నర్​ తమిళిసై అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్​ జరుగుతోందని, సీరియస్​ ఇబ్బందులేమీ నమోదు కాలేదని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు దశల్లో మొత్తం 80 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్​ ఇస్తారని చెప్పారు. మొదట కరోనాపై పోరాడుతున్న వారికి.. తర్వాత ప్రయారిటీ ఆర్డర్​లో వ్యాక్సినేషన్​ జరుగుతుందని వెల్లడించారు. కరోనా సంక్షోభ సమయంలో నిస్వార్థంగా సేవలు అందించిన ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు సెల్యూట్​ చేస్తున్నానని అన్నారు. 2020 పాండెమిక్ (మహమ్మారి) ఏడాది అని.. 2021 ప్రొటెక్షన్ ఏడాది అని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్​లోని తిలక్ నగర్  అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ ను గవర్నర్​ తమిళిసై పరిశీలించారు. హెల్త్​ స్టాఫ్, ఇతర సిబ్బందితో మాట్లాడారు. స్వయంగా గ్రీటింగ్​ కార్డులు అందజేసి, కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్​కు సంబంధించి కోల్డ్ చెయిన్ సిస్టం, వ్యాక్సిన్ వేసే పద్ధతి, వ్యాక్సిన్ తీసుకున్నవారిని తర్వాత అరగంట పాటు అబ్జర్వేషన్ లో ఉంచే విధానం మొత్తాన్ని గవర్నర్ పరిశీలించారు. తొలి దశలో ఐదు లక్షల మందికి.. తొలిదశలో ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తారని గవర్నర్​ తమిళిసై చెప్పారు. మొదట డాక్టర్లు, మెడికల్  స్టాఫ్, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇస్తారని.. తర్వాత యాభై ఏండ్లు దాటినవాళ్లు, ఇతర హెల్త్​ ప్రాబ్లమ్స్​తో బాధపడుతున్న 50 ఏండ్ల లోపు వారికి వేస్తారని వివరించారు. తర్వాత కూడా ప్రయారిటీ క్రమంలో వ్యాక్సినేషన్‌ ఉంటుందన్నారు. కరోనా వ్యాక్సిన్​ తయారీలో ఇండియన్​ సైంటిస్టులు ఎంతో కృషి చేశారని, వారిని చూసి దేశం గర్వపడుతోందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీకి చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కార్యాక్రమంలో పబ్లిక్​ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాక్సినేషన్​ డ్రైరన్ తీరును, ఏర్పాట్లను గవర్నర్ కు వివరించారు. For More News.. ‘ఒక రాష్ట్రం.. ఒకే సర్వీస్’ పేరుతో పోలీసు సేవలు ఎంబీబీఎస్ ఫ్రీ సీటును రూ. 23 లక్షలకు అమ్ముకునే కుట్ర