సౌరవ్ గంగూలీ బయోపిక్

సౌరవ్ గంగూలీ బయోపిక్

ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై రాబోతోంది. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు గా ఉన్న సౌరవ్‌ గంగూలీ జీవిత కథను ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ తెరకెక్కించనున్నారు. లవ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై లవ్‌ రంజన్‌, అంకుర్‌ గార్గ్‌లు ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. 

సినిమాకు సంబంధించిన చర్చలు, పాత్రధారుల ఎంపిక జరుగుతోందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. లవ్ ఫిలిమ్స్‌ బ్యానర్ తన జీవిత కథను సినిమాగా తీస్తున్నారని తెలిసి చాలా సంతోషం కలిగించిందని గంగూలీ ట్వీట్‌ చేశారు.