చైర్మన్​ పదవి కోసం లక్ష కట్టి స్పోకెన్ ఇంగ్లీష్​ క్లాస్

చైర్మన్​ పదవి కోసం లక్ష కట్టి స్పోకెన్ ఇంగ్లీష్​ క్లాస్

రూ.లక్ష కట్టి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సు చేసిన లీడర్, ఆయన భార్య
ఇప్పుడాయనకు పాలమూరు చైర్మన్‌ చాన్స్!

మహబూబ్ నగర్: మున్సిపల్ చైర్మన్ కావాలన్న ఆశతో ఓ లీడర్, ఆయన భార్య ఇంగ్లిష్ నేర్చుకున్నారు. అది కూడా లక్ష రూపాయలు కట్టి మరీ స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులకు వెళ్లారు. ఇదేంటి మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు ఇంగ్లిష్ ఎందుకని అనిపిస్తున్నది కదా.. కానీ మహబూబ్ నగర్ టౌన్‌లో అధికార పార్టీ లీడర్లు ఇదే చెప్పుకుంటున్నారు. ఇక్కడి ఒక లీడర్ ఓసారి కొందరు పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నప్పుడు.. ‘‘మున్సిపల్ చైర్మన్ కావాలంటే ఇంగ్లిష్ వచ్చి ఉండాలె. ఇంగ్లిష్ నేర్చుకుంటే బెటర్..” అని చెప్పారట. ఈ ముచ్చటను గట్టిగానే పట్టుకున్న సదరు లీడర్.. పట్టు బట్టి మరీ, భార్యతో సహా హైదరాబాద్‌కు వచ్చి స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులకు వెళ్లారని, ఏకంగా లక్ష రూపాయలు ఫీజు కట్టి ఇద్దరూ ఇంగ్లిష్ నేర్చుకున్నరని అంటున్నారు. సదరు లీడర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ప్రధాన అనుచరుడని, ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ అయ్యే చాన్స్​ కూడా ఉందని చెప్తున్నారు.