హెచ్ సీయూ విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

హెచ్ సీయూ విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మే 12వ తేదీ శనివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా ఫుల్ బిజిబిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడిన రేవంత్.. ఎన్నికల ప్రచారం ముగియడంతో కొత్త అవతారం ఎత్తారు. హెచ్ సీయూలో స్టూడెంట్స్ తో కలిసి ఫుట్ బాల్ ఆడిన సీఎం.. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు.  గేమ్ మధ్యలో షూ పాడైపోతే.. షూస్ లేకుండానే ఫుట్ బాల్ ఆడారు రేవంత్. 

ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్ సీయూ, ఎన్ఎస్ యుఐ విద్యార్థి నేతలు గేమ్ ఆడారు. ఫుట్ బాల్ మ్యాచ్ కు సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, గౌట్ అడ్వైజర్ హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ పహీం, టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు హెచ్ సీయూలో విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రేవంత్. వర్సిటీలో సౌకర్యాలు, ఇతర అంశాలపై విద్యార్థులను అడిగా తెలుసుకున్నారు సీఎం రేవంత్.