
ఏపీ,తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూరు బాట పట్టారు పబ్లిక్. రెండు రోజుల నుంచి భారీ సంఖ్యలో ఆంధ్రకు ఓటర్లు తరలివెళ్తున్నారు.సొంత వాహనాలతో పాటు, RTC, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూతులకు ఉండగా..9 బూతుల ద్వారా ఆంధ్ర వైపు వెళ్లే వాహనాలు పంపుతున్నారు టోల్ ప్లాజా సిబ్బంది.
పోలింగ్ కు టైం దగ్గరపడుతుండడంతో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దీంతో TS RTC అదనపు సర్వీసులను ఆన్ లైన్ లో పెట్టింది. ప్రయాణికుల రద్దీపై JBS బస్టాండ్ నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు.