బెట్టింగ్లో 2 కోట్లు పోగొట్టిన కొడుకు.. రాడ్తో కొట్టి చంపిన తండ్రి

బెట్టింగ్లో 2 కోట్లు పోగొట్టిన కొడుకు.. రాడ్తో కొట్టి చంపిన తండ్రి

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది.  చిన్న శంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో బెట్టింగ్ కు బానిసైన కొడుకున చంపేశాడు ఓ తండ్రి.  గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి  ముకేష్ కుమార్ (28) జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ లలో దాదాపు రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. 

బెట్టింగ్ లు మానుకోవాలని తండ్రి సత్య నారాయణ ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చు కోలేదు. దీంతో మే 11 శనివారం అర్ధరాత్రి ఇనుప పైప్ తో కొడుకు ముఖేష్ తలపై కొట్టడంతో ముఖేష్ కుమార్ చనిపోయాడు. మృతుడికి భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెట్టింగ్  లో ఇప్పటికే ఫ్లాట్లు, ఇళ్లు అమ్మేశాడని కుటుంబ సభ్యులు  తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన   పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.